swami Vivekananda prasangam in chicago........
అమెరికన్ సోదర సోదరీ మణులారా , ( 7000 మంది
ఉపస్థితుల నుండి 3 నిమిషాల పాటు ఆగకుండా కర తాళ
ధ్వనులు మ్రోగాయి )
నాకు మీరిచ్చిన మనోపుర్వక స్వాగతాన్ని
పురస్కరించుకొని ఈ సమయంలో మీతో
మాట్లాడటం నాకు మహానందదాయకం ప్రపంచం లోకెల్లా
అత్యంత పురాతన మైన సనాతన ధర్మం తరపున మీకు నా
అభివాదాలు , సమస్త మతాలకు , సమస్త ధర్మాలకు తల్లి
అనదగ్గ సనాతన దర్మం పేర మీకు నా అభివాదాలు , అనేక
జాతులతో , అనేక సంప్రదాయాలతో కూడిన భారత జన
సహస్రాల పేర మీకు నా అభివాదాలు .
సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనతా
గౌరవమూ సుదూర దేశస్థులైన
ప్రాచ్యులకు చెందడం ఏంటో సమంజసమని
తత్ప్రతినిధులను గురించి ఈ సభా వేదిక నుండి
మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు , సహనాన్ని ,
సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా
ధర్మమని గర్విస్తున్నాను . సర్వమత సహనాన్నే కాక ,
సర్వ మతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్త మత
సమస్త దేశాల నించీ పరపీడితులై , శరణాగతులై వచ్చిన
వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను .
రోమన్ ల నిరంకుశత్వానికి గురై తమ
దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారత దేశానికి
వచ్చి శరణు పొందిన యూదులను - నిజమైన
యుడులనదగ్గవారిల ో మిగిలిన వారిని మా కౌగిట
చేర్చుకోన్నామని తెలుపడానికి గర్విస్తున్నాను .
సోదరులారా ప్రతీ రోజు కోట్లాది మానవులచే పారాయణ
గావించబడే స్తోత్రం నుండి , అతి బాల్యం నుండి
నేను పారాయణ చేస్తున్న ఒక స్తోత్రం నుంచి కొన్ని
చరణాలు ఉదహరిస్తాను: " వివిధ ప్రదేశాల్లో జన్మించిన
నదులు సముద్రంలో సంగమించినంట్లే , వివిధ భావాలచే
మనుషులు అవలంభించే వివిధ ఆరాధనామార్గాలు వక్రాలై
కనబడిన , అవక్రాలై కనబడిన , సర్వేశ్వరా , నిన్నే
చేరుతున్నవి ."
" ఎవరు ఎ రూపంలో నన్ను గ్రహిస్తారో , నేను వారి
నాలాగే అనుగ్రహిస్తూన్న ాను. ఎల్లరూ సమస్త
మార్గాలచేతను తుదకు నన్నే చేరుతున్నారు " అని
గీతలో తెలుపబడ్డ అద్బుత సిద్ధాంతాన్ని ప్రపంచములో
మహోన్నత సమావేశాలలో ఒకటైన ఈ మతమహాసభే సమర్థిస్తూ ,
ముక్త కంఠమతో లోకానికి చాటుతుందని
చెప్పనొప్పుతుంద ి, శాఖాభిమానం, స్వ మత దురభిమానం,
దాని వాళ్ళ జనించిన మూర్ఖాభావేషము సుందరమైన యీ
జగత్తును చిరకాలంగా ఆక్రమించివున్నద ి . భూమిని
అవి దౌర్జన్యమయం గావించి, అనేక పర్యాయాలు మనవ
రక్తసిక్తం చేసాయి . ఈ ఘోర రాక్షసులు చేలరేగి
వుండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేశాభివృద్ది
పొంది ఉండేది . కాని వాటి అవసాన సమయం ఆసన్నమైనది, ఈ
మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వ
విధాలైన స్వ మత దురభిమాననికి పరమత ద్వేషానికి కత్తితో
గానివ్వండి , కలంతో గానివ్వండి, సాగించబడే నానా విధాలైన
హింసకు మాత్రమెకాక, ఒక్క గమ్యన్నే ప్రా పెంచబోయే
జనం కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతి
పాఠం కాగలదని నేను మనస్పూర్తిగా
ఆశిస్తున్నాను...............