Monday, 4 May 2020

వినరా వినరా ఓ నరుడా

వినరా వినరా ఓ నరుడా

మనిషి జీవితమే ఒక చదరంగం

ఆ పైవోడాడే ఆటలో

నువ్వు నేను పావులం.... //వినరా//




ఒక ఎత్తుతో గెలుపును చూపి,

మరో ఎత్తుతో ఓడిస్తాడు.

జీవిత సత్యం భోధిస్తాడు మరు నిమిషమే భాదిస్తాడు

ఆనందంగా ఎగిరేటప్పుడు,కన్నీళ్ళను తెప్పిస్తాడు

బంధాలతో మురిపించి ,మరణాన్ని చూపిస్తాడు

ఏ బంధం శాశ్వతం కాదంటూ అన్నిటిని తెంచేస్తాడు. .... //వినరా//




తప్పులెన్నో చేయించి, తన తప్పు లేదంటాడు

తప్పుకు తగిన శిక్షను అనుభవించమంటాడు,

మన ప్రమేయం లేకుండా పుట్టించి,మనతో దాగుడు మూతలు ఆడేసి

ఆట నుండి నిర్దాక్షిణ్యంగా అవతలకు తోసేస్తాడు.

మనం మనం కొట్టుకుంటుంటే ఆనందిస్తాడు,ఇది తప్పని చెప్పి సరిచేయడు

ఓడిన వాడిని తొసేస్తారు,గెలిచిన వాడిని మోసేస్తారు .





ఆడించినవాడిని దేవుడంటారు ................. //వినరా//

నేను నా మిత్రులు

నేను స్కూల్ కి నా మూడవ ఏటనే వెళ్ళాను అంటుంది మా అమ్మ,నా స్కూలింగ్ అంతా ఒకే స్కూల్ లో జరిగింది. నా స్కూల్ పేరు  శ్రీ సరస్వతి శిశు మందిర్. చాలా గర్వముగా ఉంటుంది చెప్పేటప్పుడు,ఆ స్కూల్ పద్ధతులు ,ఆచార వ్యవహారాలు,మన తెలుగు  సంప్రదాయాలు ఒక్కటేమిటి అన్ని ఆ స్కూల్ లో నేర్పిస్తారు, శ్రీ సరస్వతి శిశు మందిర్ గురించి  పూర్తిగా మరొక్క పోస్ట్ లో రాసాను,ఒకసారి చూడండి.

ఇక నా మిత్రుల గురించి చెప్పాలంటే,నాకు చాల మిత్రులు ఉన్నారు,ఒకరకంగా నేను అందరితో కలిసిపోతాను, ఇక్కడ నేను ప్రస్తావించే ఫ్రెండ్స్ మాత్రమే కాక చాలా మంది నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు కాకపోతే వీళ్ళకి నేను  బాగా దగ్గరై ఉండొచ్చు,లేదా   వాళ్ళ స్నేహాన్ని బాగా ఆస్వాదించి ఉండొచ్చు.ఇక్కడ ఫ్రెండ్స్ ని నాలుగు కేటగిరిలు గా విభజిస్తున్నాను,కేటగిరిలు అంటే డబ్బు,కులం, మతం  అనుకున్నారు,ఆలా కాదు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ , రూంమేట్స్ , కోలీగ్స్, మనిషి జీవితంలోను నాకు తెలిసి ఇవే కేటగిరిలు ఉంటాయి.వీళ్ళతో నేను అన్ని షేర్ చేసుకుంటాను కానీ ఎప్పుడు ఇంతవరకు నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేదు,అదేంటో చిన్నప్పటి నుండి అంతే అందరితోనూ బాగుంటాను కానీ ఎవ్వరితోను నా విషయాలను పంచుకోలేదు, ఇంక నా మిత్రుల గురించి చెప్పాలంటే ముందుగా నా స్కూల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం.

స్కూల్ లో పరిచయమయ్యే ఫ్రెండ్స్ మాత్రమే స్వచ్చమైన మనసు కలిగి ఉంటారు,ఎందుకంటే వాళ్ళకి మన కులంతో,మతంతో,డబ్బుతో పని లేదు,వాళ్లకి కావలసింది మన స్నేహం మాత్రమే.
అదే ఫ్రెండ్స్ వయస్సు పెరిగేకొద్దీ మారుతారు అనుకొండి అది వేరే విషయం,కానీ స్కూల్ లో ఉన్నంత కాలం వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటుంది.











 

Tuesday, 28 April 2020

అంతర్యుద్ధం

యుద్దం, నాతో నేనే చేసుకుంటున్నాను,
మందు లేని గాయాలతో అలిసిపోయిన శరీరంతో
ఫలితంతో సంబంధం లేకుండా నాలోని ఆత్మారాముడితో జరుగుతున్న రణం
రక్తం చిందదు,ఏడుపులు ఉండవు,కాని కురుక్షేత్రాన్ని మించిన మహా సంగ్రామం
కాలం మాత్రమే పరిష్కరించే ఈ సంగ్రామంలో కాలానికి  కూడా ఎదురు నిలబడి పోరాడాలి
అంతిమ లక్ష్యం విజయంగా, నేను చేస్తున్న ఈ పోరాటంలో నా విజయకాంక్ష తీరెదెన్నడో



శరీరం సహకరించకున్నా నా మనసుదే పై చేయి అవుతున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా
తనతో పోరాడుతున్న,
సమస్య ఏదైన తనతో ఎప్పుడూ విభేదాలే,అర్థం చేసుకోలేని మనసు,తాహతుకు మించిన కోరికలతో
ఎల్లప్పుడూ గొడవలే ,
అందుకే ఈ యుద్దం ఒకరోజుతో సమసిపోయేది కాదు,

Monday, 1 April 2019

Dubai

Add caption
 Nagaraju anna's sister House at Dubai-pic(1)
Dubai mall with best buddy





Wednesday, 10 February 2016

గోదావరి పుష్కరాలు - నా అనుభవాలు(1)

గోదావరి పుష్కరాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నాయని తెలియగానే నేను మా ఫ్రెండ్స్  పుష్కరాలకు వెళ్ళాలని అనుకున్నాం.ఎప్పటిలానే  నేను,హరి,శివ,గిరీష్ రెడీగా ఉన్నాం,నేను ముందుగానే మా మేడం దగ్గర పర్మిషన్ తీసేసుకున్నా,ఒక నాలుగు రోజులు ఊరు మొత్తం తిరిగేద్దామని,ఇంతలో ముని, బక్కోడు(వీడు పేరు కూడా శివ నే),పవన్  కూడా వచ్చి చేరారు.
నేనెమో మేడం దగ్గర ఆల్ రెడీ పర్మిషన్ తీసేసుకున్న,ఇప్పుడెమో వీళ్ళు జనాలు ఉంటారు లాస్ట్ డేస్ లో వెళ్తాం అంటున్నారు,నాకేమో లీవ్ దొరకదు,సరేలే అని మళ్ళీ మా మేడం ని లీవ్ ని మార్చమని చెప్పా,ఈ సారి అసలు ఒప్పుకోలేదు,స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ ఉన్నాయి అసలు లీవ్ ఇవ్వను అని చెప్పేసింది. ముందుగా వెళ్దామంటే ముని ఒప్పుకోవడం లేదు,ఇంక చేసెదేం లేక మీరు వెళ్ళండి నేను రాలేను అని చెప్పా,వాళ్ళు కూడా సరే అని మేమే వెళ్తాం అని చెప్పారు, అలా చెప్పానే కానీ నాకు చాలా బాధ వేసింది .ముని కోసం మేమంతా వాయిదా వేసుకున్నాం,కాని ఇప్పుడు నా కోసం ఆగలేకపోయారు.

నేను వీలు చిక్కినప్పుడల్లా మా మేడం ని అడగతానే ఉన్నా,కొన్ని వందల రిక్వెస్ట్ ల తర్వాత ఒప్పుకుంది,వెంటనే హరి కి ఫోన్ చేసి చెపప నేను వస్తున్నాను అని,టికెట్స్ దొరకలేదు జనరల్ లో వెళ్ళాలి అన్నాడు,సరేలే ఎదైతే ఏముంది అనుకుని ఒకే చెప్పా, ఇంట్లొ అన్ని జాగ్రత్తలు తీసుకుని శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ కి బయలుదేరాం             

Sunday, 10 November 2013

na gurinchi



హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గురు సాయి కిరణ్.


మా ఊరు శ్రీకాళహస్తి.మా ఊరికి చాలా ప్రాముఖ్యత ఉంది.మా ఊరి గురించి పూర్తి సమాచారం కోసం మరొక్క టాపిక్ లో వివరంగా రాసాను.నా ఇష్టమైన క్రికెటర్ 'క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్  '.ఇంకా నా ఇష్టమైన కలర్ పసుపు మరియు తెలుపు.నేను మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిని.నాకు భజన చేయటం రాదు,తప్పు చేయనప్పుడు తలవంచను....

నాకు దుఃఖాన్ని పంచుకోవాలని ఉండదు ....ఒకరి ఓదార్పు, జాలి, దయ నేను తీసుకోలేను.....ఒకరి కోపాన్నైనా భరించగలను కానీ జాలిని స్వీకరించలేను.....ఆత్మాభిమానం అస్సలు  వదులుకోను,హద్దులు దాటని పరిచయాలు ఇష్టం..ఇంకా చాలా ఉన్నాయ్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను 

Tuesday, 5 November 2013

 swami Vivekananda  prasangam in chicago........



అమెరికన్ సోదర సోదరీ మణులారా , ( 7000 మంది ఉపస్థితుల నుండి 3 నిమిషాల పాటు ఆగకుండా కర తాళ ధ్వనులు మ్రోగాయి ) నాకు మీరిచ్చిన మనోపుర్వక స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు మహానందదాయకం ప్రపంచం లోకెల్లా అత్యంత పురాతన మైన సనాతన ధర్మం తరపున మీకు నా అభివాదాలు , సమస్త మతాలకు , సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన దర్మం పేర మీకు నా అభివాదాలు , అనేక జాతులతో , అనేక సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు . సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనతా గౌరవమూ సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందడం ఏంటో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ సభా వేదిక నుండి మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు , సహనాన్ని , సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను . సర్వమత సహనాన్నే కాక , సర్వ మతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్త మత సమస్త దేశాల నించీ పరపీడితులై , శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను . రోమన్ ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారత దేశానికి వచ్చి శరణు పొందిన యూదులను - నిజమైన యుడులనదగ్గవారిల ో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకోన్నామని తెలుపడానికి గర్విస్తున్నాను . సోదరులారా ప్రతీ రోజు కోట్లాది మానవులచే పారాయణ గావించబడే స్తోత్రం నుండి , అతి బాల్యం నుండి నేను పారాయణ చేస్తున్న ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలు ఉదహరిస్తాను: " వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించినంట్లే , వివిధ భావాలచే మనుషులు అవలంభించే వివిధ ఆరాధనామార్గాలు వక్రాలై కనబడిన , అవక్రాలై కనబడిన , సర్వేశ్వరా , నిన్నే చేరుతున్నవి ." " ఎవరు ఎ రూపంలో నన్ను గ్రహిస్తారో , నేను వారి నాలాగే అనుగ్రహిస్తూన్న ాను. ఎల్లరూ సమస్త మార్గాలచేతను తుదకు నన్నే చేరుతున్నారు " అని గీతలో తెలుపబడ్డ అద్బుత సిద్ధాంతాన్ని ప్రపంచములో మహోన్నత సమావేశాలలో ఒకటైన ఈ మతమహాసభే సమర్థిస్తూ , ముక్త కంఠమతో లోకానికి చాటుతుందని చెప్పనొప్పుతుంద ి, శాఖాభిమానం, స్వ మత దురభిమానం, దాని వాళ్ళ జనించిన మూర్ఖాభావేషము సుందరమైన యీ జగత్తును చిరకాలంగా ఆక్రమించివున్నద ి . భూమిని అవి దౌర్జన్యమయం గావించి, అనేక పర్యాయాలు మనవ రక్తసిక్తం చేసాయి . ఈ ఘోర రాక్షసులు చేలరేగి వుండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేశాభివృద్ది పొంది ఉండేది . కాని వాటి అవసాన సమయం ఆసన్నమైనది, ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వ విధాలైన స్వ మత దురభిమాననికి పరమత ద్వేషానికి కత్తితో గానివ్వండి , కలంతో గానివ్వండి, సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమెకాక, ఒక్క గమ్యన్నే ప్రా పెంచబోయే జనం కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను...............