Tuesday, 28 April 2020

అంతర్యుద్ధం

యుద్దం, నాతో నేనే చేసుకుంటున్నాను,
మందు లేని గాయాలతో అలిసిపోయిన శరీరంతో
ఫలితంతో సంబంధం లేకుండా నాలోని ఆత్మారాముడితో జరుగుతున్న రణం
రక్తం చిందదు,ఏడుపులు ఉండవు,కాని కురుక్షేత్రాన్ని మించిన మహా సంగ్రామం
కాలం మాత్రమే పరిష్కరించే ఈ సంగ్రామంలో కాలానికి  కూడా ఎదురు నిలబడి పోరాడాలి
అంతిమ లక్ష్యం విజయంగా, నేను చేస్తున్న ఈ పోరాటంలో నా విజయకాంక్ష తీరెదెన్నడో



శరీరం సహకరించకున్నా నా మనసుదే పై చేయి అవుతున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా
తనతో పోరాడుతున్న,
సమస్య ఏదైన తనతో ఎప్పుడూ విభేదాలే,అర్థం చేసుకోలేని మనసు,తాహతుకు మించిన కోరికలతో
ఎల్లప్పుడూ గొడవలే ,
అందుకే ఈ యుద్దం ఒకరోజుతో సమసిపోయేది కాదు,

No comments:

Post a Comment